TRS leaders resigned today: ఎమ్మెల్సీలుగా అవకాశం రాని అసంతృప్త నేతల రాజీనామాల పర్వం మొదలైంది. అధికార తెరాస అసంతృప్త నేతలు గులాబీ కండువాకు గుడ్‌బై చెబుతున్నారు. ఇవాళ ఒకే రోజు ఇద్దరు తెరాస నాయకులు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు(gattu rama chandra rao resigned trs) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాజీనామా లేఖను(resign letter to cm kcr) పంపారు. కేసీఆర్ అభిమానాన్ని, గుర్తింపును పొందడంలో విఫలమయ్యానని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగడం సరైంది కాదని భావిస్తున్నట్లు తెలిపారు. వైకాపా నుంచి తెరాసలో చేరిన గట్టు రామచంద్రరావు.. ఎమ్మెల్సీతో పాటు పలు పదవులు ఆశించినా నిరాశ తప్పలేదు.
కరీంనగర్ మాజీ మేయర్ రాజీనామా
కరీంనగర్ జిల్లాలోనూ తెరాసకు షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితో తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్(karimnagar ex mayor ravinder singh resigned trs) ప్రకటించారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. కరీంనగర్ పట్టణ భాజపా అధ్యక్షుడిగా ఉన్న తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమ సయమంలో తెరాసలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆ తర్వాత తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోకపోవడం బాధను కలిగిస్తోందని సర్దార్ రవీందర్ సింగ్(ex mayor resigned for trs) ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధంలేని వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీనంగర్ జిల్లాలో(karimnagar trs leader resign) పార్టీని ఉద్యమంతో సంబంధం లేని వారి చేతిలో పెట్టడంతో కొందరు పార్టీని తమ జేబు నింపే సంస్థగా మార్చుకున్నారని విమర్శించారు.
ఈ విషయం సీఎం దృష్టికి తీసుకు రావాలని అనేక సార్లు యత్నించినా కొందరి మాటలు విని తనకు ఆ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు అవకాశం లేదని బాధను వ్యక్తం చేశారు. బాధాతప్త హృదయంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా తెరాస పార్టీ కార్యాలయానికి పంపిస్తునట్లు రవీందర్ సింగ్(karimnagar ex mayor ravinder singh) వెల్లడించారు.
ఇదీ చూడండి: