కరీంనగర్ జిల్లా గంగాధరలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.
అణగారిన వర్గాలు గర్వపడే భరతమాత ముద్దబిడ్డ బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి కొనియాడారు. దశాబ్దాలుగా పేద ప్రజల ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తని గుర్తు చేశారు. అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరంగా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి : గ్రీన్ఇండియా కోసం కృషి చేద్దాం: షాయాజీ షిండే