ETV Bharat / state

ప్రైవేట్‌ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన విద్యాశాఖ నిర్లక్ష్యం - telangana latest news

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న నగదు, ఉచిత బియ్యం సాయం అందరికీ అందడం లేదు. సమాచార లోపం కారణంగా చాలా మంది ఉపాధ్యాయులు ఈ సాయానికి నోచుకోలేకపోతున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా తమకు సర్కార్‌ సాయం అందడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే చొరవ తీసుకుని తమకు సాయం అందించాలని కోరుతున్నారు.

government assistance to private teachers

author img

By

Published : Apr 25, 2021, 5:25 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం, సన్నబియ్యం పంపిణీ ప్రవేశపెట్టింది. అయితే పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యం, సమాచార లోపంతో చాలా మంది ఉపాధ్యాయులకు ఈ సాయం అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 6 వేల పైచిలుకు ఉపాధ్యాయులు పని చేస్తుండగా.. ప్రభుత్వ లెక్కలు(యూడైస్‌ వెబ్‌సైట్‌)లో మాత్రం కేవలం లక్షా 24 వేల మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయి. దాదాపు 80 వేల మందికి పైగా ఉపాధ్యాయులు, సిబ్బంది సాయం కోసం దరఖాస్తు చేసుకున్నా.. తిరస్కరణకు గురయ్యాయి.

యూడైస్‌లో పేర్ల నమోదు ప్రక్రియ 2017లో ప్రారంభమైనా.. ఆ తర్వాత పేర్ల నమోదు ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా కొందరికి మాత్రమే ప్రభుత్వ సాయం అందుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వమే చొరవ తీసుకుని.. మిగిలిన వారికీ సాయం అందేలా చూడాలని ఉపాధ్యాయులకు కోరుతున్నారు.

మంత్రి గంగుల హామీ..

ప్రైవేటు ఉపాధ్యాయుల నుంచి వస్తోన్న వినతులపై పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు యూడైస్‌లో ఉన్న వివరాల ప్రకారం బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చాలా మంది పేర్లు పోర్టల్‌లో నమోదు కాలేదని చెబుతున్న దృష్ట్యా.. తప్పకుండా ఆ వివరాలను సేకరించి అందరికీ బియ్యంతో పాటు నగదు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వరకు వేసవి సెలవులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.