కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పత్తి కుంటపల్లి రైతు గ్యాన మల్లారెడ్డి వరి పంటకు నిప్పుపెట్టారు. ఎకరం విస్తీర్ణంలో సన్న రకం వరి పంట సాగు చేయగా అధిక వర్షాలు పంటలు తీవ్రంగా దెబ్బతీశాయి. దీనికి తోడు దోమపోటు, కంకినల్లి ఆశించటంతో వరి పంట పూర్తిగా నేల వాలింది. అదే సమయంలో అధిక వర్షాలతో పంట భూమి మొత్తం జాలువారి పొట్ట దశకు చేరుకున్న ధాన్యం నీటిలో మురిగిపోయింది.
చివరికి ఇంటి కోసం కూడా పంట మిగలలేదు. వరికోతలు చేపట్టినా ఫలితం లేకుండా పోయిందని మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర నిరాశకు లోనైన రైతు ఎకరం పొలంలోని పంటకు నిప్పు పెట్టి దహనం చేశారు.