పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని సీపీ కమలహాసన్ రెడ్డి సూచించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఠాణాను ఆయన సందర్శించారు. కేసుల దర్యాప్తునకు సంబంధించి ఎస్సైలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
సర్కిల్ పరిధిలో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఠాణాలో రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో శాంతి, భద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.