ETV Bharat / state

Telangana Congress MLA Tickets in Karimnagar : కరీంనగర్​లో కాంగ్రెస్​లో టికెట్ కలవరం.. ఆరు స్థానాలు దక్కేదెవరికి..?

Telangana Congress MLA Tickets in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనపై పార్టీశ్రేణుల్లో మిశ్రమ స్పందన నెలకొంది. ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో ఉమ్మడి జిల్లాలో ఏడు స్థానాల అభ్యర్థులకు చోటు దక్కగా... మరో ఆరు స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. కొందరు అభ్యర్థిత్వం ఖరారు అవుతుందన్న అంచనాతో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరుచోట్ల ఎవరికీ అభ్యర్థిత్వం దక్కుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Telangana Congress MLA Tickets
Telangana Congress MLA Tickets in Karimnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 10:44 AM IST

Telangana Congress MLA Tickets in Karimnagar కరీంనగర్​లో కాంగ్రెస్ సీటు ఎవరికి ?.. ఆరుచోట్ల ఎవరినీ ప్రకటిస్తారనే అంశంపై ఉత్కంఠ

Telangana Congress MLA Tickets in Karimnagar : కరీంనగర్‌ సహా మిగతా ఐదు స్థానాల్లో అభ్యర్థుల ఖరారులో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే వడపోత ప్రక్రియ పూర్తి కాగా మిగిలిన ఇద్దరు ముగ్గురి పేర్లలో ఎవరిని ప్రకటించాలనే విషయమై మల్లగుల్లాలు పడుతోంది. కరీంనగర్‌లో 15 మంది పోటీ పడుతుండగా అందులో ముగ్గురి పేర్లను అధిష్ఠానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జయపాల్‌ రెడ్డితో పాటు.. శ్రీనివాస్‌, నరెందర్‌రెడ్డి పోటీ పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. చొప్పదండిలో గతంలో ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గంలో సమస్యలపై గళమెత్తడమే కాకుండా మేడిపల్లి సత్యం ‘గడప గడపకు కాంగ్రెస్‌’ పేరిట ప్రచారం చేస్తున్నారు. అతని పేరు తొలి జాబితాలో లేకపోవడం పార్టీ శ్రేణుల్ని అయోమయంలో పడేసింది.

Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్‌ పార్టీ ప్రచార జోరు.. ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్​

సిరిసిల్లలో దరఖాస్తు చేసుకున్న వారిలో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థిని తేల్చేపనిలో పార్టీ నిమగ్నమైంది. హుజురాబాద్‌లో బల్మూరి వెంకట్‌ సహా వొడితెల ప్రణవ్‌ బాబు మధ్య గట్టి పోటీ ఉన్నట్లు ప్రచారంలో ఉంది. కోరుట్ల టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌ తర్జనభర్జన కొనసాగుతోంది. జువ్వాడి నర్సింగరావుతో పాటు.. కరంచంద్‌, మరికొందరు ఆశిస్తున్నారు. ఆ ఆరు చోట్లలోఎవరిది పైచేయి అవుతుందనే ఉత్కంఠ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంథని, పెద్దపల్లి, రామగుండం స్థానాలకు పేర్లను హస్తం పార్టీ ప్రకటించింది. ఇక్కడ ప్రచారానికి రాహుల్‌ గాంధీ ఈనెల 19 రానున్నారు.. అదే రోజు కరీంనగర్‌లో పాదయాత్ర చేపట్టనుండటంతో అప్పటి వరకు అభ్యర్థిత్వం కొలిక్కి వస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న ప్రారంభం

తొలి జాబితాలో ఉన్న వారిలో మానకొండూరు నుంచి పోటీ పడుతున్న కవ్వంపల్లి సత్యనారాయణ మినహా మిగతా ఆరుగురు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన వారే కావడం గమనార్హం. అందులో మంథని నుంచి శ్రీధర్‌బాబు మాత్రమే విజయం సాధించారు. మిగతా వారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరీంనగర్‌ జిల్లాలో చొప్పదండి, కరీంనగర్‌, హుజూరాబాద్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల స్థానాలకు అభ్యర్థులను మలి జాబితాలో ప్రకటించే అవకాశముంది.

హుస్నాబాద్‌ విషయంలోనూ సందిగ్ధం వీడలేదు. వామపక్షాలతో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతుండటంతో ఇక్కడ అభ్యర్థిత్వం ఖరారులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మధ్య తీవ్ర పొటీ నెలకొంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 13నియోజకవర్గాల్లో పోటీకి 89 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోవడంతో అభ్యర్థి ఖరారులో కాంగ్రెస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది.

Puvvada Fire on Tummala Nageshwararao : తుమ్మల వల్ల బీఆర్ఎస్​కు ఒరిగిందేమీ లేదు : పువ్వాడ

Congress MLA Candidates Second List in Telangana : ఈ నెల 21 తర్వాతే కాంగ్రెస్​ అభ్యర్థుల రెండో జాబితా.. 9 స్థానాల ఎంపికకు కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.