ETV Bharat / state

కేసీఆర్​ను ఈటల వెన్నుపోటు పొడిచారు: ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజ్‌ - దళిత బంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజ్‌ కేంద్రానికి సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ ఆధ్వర్యంలో కళాకారులు తెలంగాణ ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు.

TELANGAANA_DHOOM_DHAAM_
కేసీఆర్​ను ఈటల వెన్నుపోటు పొడిచారు
author img

By

Published : Aug 24, 2021, 7:56 AM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ ఆధ్వర్యంలో కళాకారులు తెలంగాణ ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కళారూపాల ద్వారా కళాకారులు ప్రదర్శించారు. కళాకారులు ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌ రసమయి బాలకిషన్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కేసీఆర్​ను ఈటల వెన్నుపోటు పొడిచారు..

పార్టీలో గౌరవం లేకనే ఆత్మ గౌరవం కోసం బయటికి వెళ్లానని ఈటల రాజేందర్​ చెప్పటం శోచనీయమని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజ్‌ అన్నారు. ఈటలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే పార్టీకి... మఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. దళితుల, బడుగు బలహీన వర్గాల భూములను ఆక్రమించుకొని ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల భాజపాలో చేరారని గువ్వల బాలరాజ్‌ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేసి ఉంటే ఈటల ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి... ఎందుకు భాజపాలో చేరాడో సమాధానం చెప్పాలని గువ్వల బాలరాజ్‌ డిమాండ్‌ చేశారు. పాదయాత్ర పేరిట ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌, భాజపాలు కుమ్మక్కై ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వాన్ని అస్థిర పర్చే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకి కేంద్రం ఎందుకు సాయం అందించటం లేదని ప్రశ్నించారు. రానున్న ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.

ఇదీ చదవండి:

Job vacancies in Telangana : రాష్ట్రంలో 67,820 ఉద్యోగ ఖాళీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.