కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి వద్ద సైఫన్ ఎందుకు నిర్మించడం లేదని తెదేపా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గంలో రూ. 248 కోట్ల ఖర్చుతో 26 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న తెరాస విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు.
నారాయణపూర్ చెరువు పరిశీలిన..
శ్రీరాములపల్లి వద్ద వృథాగాపోతున్న నారాయణపూర్ చెరువు జలాలను ఆయన సందర్శించారు. చెరువు ఎడమకాల్వ నుంచి సైఫన్ లేక నీరంతా వృథాగా ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వలో కలుస్తోందని జోజిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
'డీ1 కాల్వ నిర్మాణ ఏది ?'
గత కొన్ని ఏళ్లుగా డీ1 కాల్వ కోసం రైతులు ఆందోళన చేపట్టినా... తెరాస పెడచెవిన పెట్టిందన్నారు. డీ1 కాల్వ పూర్తైతే రామడుగు, చొప్పదండి మండలాల్లోని పది గ్రామాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. కేవలం రూ. 2 కోట్ల వ్యయంతో పూర్తయ్యే సైఫన్ నిర్మాణంపై ఇంత తీవ్రంగా నిర్లక్ష్యం చూపడం సరికాదని జోజిరెడ్డి హితవు పలికారు. వెంటనే సంబంధిత సైఫన్ నిర్మించి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : నిరాడంబరంగా బతుకమ్మ ఆట.. కరోనాతో తగ్గిన సందడి