ETV Bharat / state

ఆన్​లైన్​ పాఠాలు వినేందుకు.. కూలీకెళ్లి స్మార్ట్​ఫోన్​ కొన్నాడు!

కరోనా వైరస్​ వ్యాప్తి వల్ల పాఠశాలలు ఆన్​లైన్​లో పాఠాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. స్మార్ట్​ఫోన్​, ఇంటర్నెట్​, టీవీ సౌకర్యం ఉన్నవాళ్లు ఎలాగోలా డిజిటల్​ పాఠాలు వింటున్నారు. కానీ.. స్మార్ట్​ఫోన్​, ఇంటర్నెట్​ సౌకర్యం లేని విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కరీంనగర్​ జిల్లాలో ఓ విద్యార్థి ఆన్​లైన్​ పాఠాలు వినడం కోసం.. కూలీ పనులకు వెళ్లి డబ్బులు కూడబెట్టుకొని స్మార్ట్​ఫోన్​ కొనుక్కున్నాడు.

Student Buy SmartPhone With His Earning For Attending Online Classes
ఆన్​లైన్​ పాఠాలు వినేందుకు.. కూలీకెళ్లి స్మార్ట్​ఫోన్​ కొన్నాడు!
author img

By

Published : Sep 19, 2020, 5:20 PM IST

కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సిర్ర శివరాం పదో తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్​ కారణంగా పాఠశాలలు మూతపడి.. ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు ఆన్​లైన్​లో పాఠాలు మొదలుపెట్టారు. అయితే.. ఆన్​లైన్​ పాఠాలు వినాలంటే స్మార్ట్​ఫోన్​ ఉండాల్సిందే. కానీ.. శివరాంకి స్మార్ట్​ఫోన్ లేదు. తండ్రి మల్లయ్య కూలీపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించే మల్లయ్యకు స్మార్ట్​ఫోన్​ కొనే ఆర్థిక స్థోమత లేదు. మరి పదో తరగతి చదువుతున్న శివరాం ఆన్​లైన్​లో టీచర్లు చెప్పే పాఠాలు వినేదెలా?

ఆన్​లైన్​ పాఠాలు వినేందుకు.. కూలీకెళ్లి స్మార్ట్​ఫోన్​ కొన్నాడు!

శివరాంకి తల్లిదండ్రులను స్మార్ట్​ఫోన్​ కోసం ఇబ్బంది పెట్టాలనిపించలేదు. అందుకే.. మూడు నెలలు కూలీ పనులకు వెళ్లాడు. ఆ డబ్బులన్నీ కూడబెట్టి రూ.9వేలు పెట్టి స్మార్ట్​ఫోన్​ కొనుక్కున్నాడు. తన కష్టంతో కొనుక్కున్న స్మార్ట్​ఫోన్​లో క్రమం తప్పకుండా ఆన్​లైన్​లో పాఠాలు వింటున్నాడు. స్మార్ట్​ఫోన్​ కోసం అమ్మానాన్నలు వేధించే ఈ కాలంలో.. తల్లిదండ్రులకు భారం కాకుండా.. కూలీకి వెళ్లి స్మార్ట్​ఫోన్​ కొనుక్కొని ఆన్​లైన్​ పాఠాలు వింటున్న శివరాంను అందరూ అభినందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.