ETV Bharat / state

huzurabad by elections 2021:పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ.. ఆ వివరాలపై ఆరా...

హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad by elections 2021) ప్రశాంతంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ వేర్వేరుగా పర్యటించారు. పోలింగ్​కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని... పటిష్ఠ బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతోందని వెల్లడించారు.

huzurabad by elections 2021, huzurabad polling
హుజూరాబాద్ ఉపఎన్నికలు, కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ పరిశీలన
author img

By

Published : Oct 30, 2021, 11:25 AM IST

హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ (huzurabad by elections 2021)కేంద్రాలను కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. వీణవంకలోని కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌... పోలింగ్ సరళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్‌ కర్ణన్‌ హెచ్చరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad by elections 2021) వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి అప్రమత్తతో ఉన్నామని కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఓటర్లు ఉదయం నుంచే కొవిడ్ నిబంధనలు(covid news) పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. వీణవంకలో పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు

పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది. ఇప్పటివరకు అనగా ఉదయం 9 గంటల వరకు దాదాపుగా 10.5 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. తొలుత ఆరు పోలింగ్ కేంద్రాల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తాయి. సిబ్బంది వాటిని వెంటనే రెక్టిఫై చేశారు. ఏ ప్రాంతంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 7 గంటల్లోపు వచ్చిన వారందరికీ ఓటింగ్ అవకాశం కల్పిస్తాం. అందరూ ఓటు వేయాలని కోరుతున్నాను. వంద మీటర్లలోపు ఎవరూ ప్రచారం చేయకూడదు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. పోలింగ్ సరళిపై సీపీ సమీక్షిస్తున్నారు.

-ఆర్వీ కర్ణన్, కరీంనగర్ కలెక్టర్

పోలింగ్‌ జరుగుతున్న సమయంలో... సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారాలు చేసే అవకాశముందని... తప్పుడు వార్తలను నమ్మొద్దని సీపీ సూచించారు. పోలింగ్ ముగిసేంత వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం కోసం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన నేతలను ఇప్పటికే హుజరాబాద్ నియోజకవర్గం నుంచి పంపించినట్లు వెల్లడించారు.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభం కాగా... ఒక్క కేంద్రంలో మాత్రం ఈవీఎం టెక్నికల్​ సమస్య వచ్చిందని చెప్తున్నారు. మిగతా చోట్ల పోలింగ్ ప్రారంభమై.. ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఓట్లు వేస్తున్నారు. బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసులు కలిసి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం. రూమర్స్ ఎవరూ నమ్మవద్దు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు.

-సత్యనారాయణ, కరీంనగర్‌ సీపీ

ఇదీ చదవండి: Huzurabad by election 2021: ప్రశాంతంగా కొనసాగుతున్న హూజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.