సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపుగా 150 మంది సైక్లిస్టులు ఈ పోటీలకు తరలివచ్చారు. వీటిలో ప్రావీణ్యం కనబరిచిన సైక్లిస్టులను ఈనెల 20వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్టు సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్