కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా ఛైర్మన్ రామకృష్ణ రావుతో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలకుగాను అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు స్థానికంగా ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల ఎంతో మంది నష్టపోయారని గుర్తు చేశారు. అనంతరం నూతన భవనానికి భూమి పూజ చేశారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్ : స్వదేశానికి చేరిన సమీనా