ETV Bharat / state

అమ్మను అనాథను చేశారు - పోషించలేమంటూ రోడ్డుపై వదిలేశారు - 80 ఏళ్ల వృద్ధురాలి కథ

Sons Left Their Mother on Road in Karimnagar : కరీంనగర్​లో ఓ వృద్ధురాలు రోడ్డుపాలైంది. కడుపున పుట్టిన పిల్లలకు ఆ తల్లి భారమైంది. కన్నతల్లిని కాదనుకుని ఆ కఠినాత్ములు రోడ్డున వదిలేసి వెళ్లిపోయారు. అయ్యో పాపం అంటూ స్థానికులు చేర దీసి శిథిలావస్థకు చేరిన ఓ పాత ఇంట్లో ఆశ్రయం కల్పించారు.

Old Women Sad Story in Karimnagar
Old Women Sad Story in Karimnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 12:24 PM IST

Sons Left Their Mother on Road in Karimnagar : చిన్నతనంలో పిల్లలను తల్లిదండ్రులు అల్లరు ముద్దుగా పెంచి పోషిస్తారు. వారు పెద్దయ్యే సరికి వీరు వృద్ధాప్య దశకు చేరుకుంటారు. ఆ వయస్సులో తోడుగా ఉండాల్సిన పిల్లలే, శత్రువులుగా మారుతున్నారు. కనీసం ఎదుటి వారికి ఉన్న ప్రేమ, జాలి కూడా వారి పేరెంట్స్​ మీద చూపించలేకపోతున్నారు. నవ మాసాలు మోసి, కనిపెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన కుమారుడు, కుటుంబ సభ్యులు వారిని అనాథలుగా వదిలేస్తున్నారు.

తాజాగా కరీంనగర్ జిల్లాలో 80 ఏళ్లు ఉన్న ఓ వృద్ధురాలిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు కుమారుడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు తెలపగా కుమారుడిని పిలిచి పంచాయతీ పెట్టారు. ఎంత చెప్పినా ఆ వృద్ధురాలి కుమారుడు వినకుండా తల్లిని ఇంటికి తీసుకువెళ్లేందుకు ఒప్పుకోలేదు. ​దీంతో స్థానికులు స్పందించి ఓ శిథిలావస్థలో ఉన్న ఇంటికి తీసుకువెళ్లారు.

65 ఏళ్ల వయసులో జీవనపోరాటం.. కొడుకుల కష్టాలు కడతేర్చేందుకు ఆరాటం..

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్​ జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్​ గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆమె భర్తతో పాటు పెద్ద కుమారుడు, ఓ కుమార్తె మృతి చెందారు. వృద్ధాప్యంలో ఉన్న లచ్చమ్మను పెద్ద కుమారుడి కుటుంబం, చిన్న కుమారుడు విడతల వారీగా చూసేందుకు ఒప్పందం చేసుకున్నారు.

Mother Lachamma Story in Karimnagar : లచ్చమ్మ పెద్ద కుమారుడు రాజయ్య కుటుంబ సభ్యులు మహారాష్ట్రలో నివాసం ఉంటున్నారు. వారి వంతు ప్రకారం ఆమెను చూసుకున్నారు. తమ వంతు ముగిసినంతరం శుక్రవారం ఆమెను అక్కడి నుంచి వాహనంలో సొంత గ్రామానికి తీసుకువచ్చి చిన్న కుమారుడి ఇంటి వద్ద దింపారు. ఆమెను చిన్న కుమారుడు కుటుంబసభ్యులు ఇంట్లోకి తీసుకెళ్లకుండా ఆటోలో పాత ఇంటి సమీపంలో రోడ్డు పక్కన(Old Women Sleep Beside Road) దించేసి వెళ్లిపోయారు.

క్యాన్సర్​తో కూతురు మృతి- విగ్రహంతోనే జీవిస్తున్న తల్లి! రోజూ అన్ని చెప్పుకుంటూ కన్నీరు

Old Women Sad Story at Tadical Village : రోడ్డు పక్కన ఉన్న వృద్ధురాలి(లచ్చమ్మ)ని(Lachamma Story in Karimnagar) చూసి చలించిపోయి 100కు డయల్ చేశారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత చిన్న కుమారుడితో పాటు అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారు ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో స్థానికులు ఆమెను శిథిలావస్థకు చేరిన ఓ పాత ఇంటికి తీసుకువెళ్లి ఉంచారు. 80 ఏళ్ల వృద్ధురాలికి ఈ పరిస్థితి రావడం బాధాకరమని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. రాత్రి చిన్న కుమారుడు తల్లి కోసం భోజనం తీసుకు వచ్చాడని, పాత ఇంట్లోనే ఉంచి భోజనం పెడతానని అతను చెప్పినట్లు స్థానికులు తెలిపారు.

అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

అచేతనంగా కుమారుడు.. ఆదుకోవాలని తల్లి ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.