కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రవరం గ్రామం అనాథలైనా గుర్రం నవిత , గుర్రం నవీన్‌లకు బుల్లితెర నటుడు శకలక శంకర్ ప్రజా విరాళం అందజేశారు. తల్లిదండ్రులను కోల్పోయి సొంత ఇల్లు కూడా లేని వారి దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. వారి విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే శ్రీ రాములపల్లిలో నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలైన మూడు కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున నగదును సహాయం అందజేశారు. తాను నటన వృత్తిలో ఎంత నిమగ్నమై ఉన్నా ఆపదలో ఉన్న వారికి సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తానని షకలక శంకర్ వెల్లడించారు. ప్రజా విరాళాలకు ముందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: దాతృత్వాన్ని చాటుకున్న షకలక శంకర్... ఏం చేశారంటే?