కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్తున్న నాన్‌స్టాప్ బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరి ప్రతిమా మల్టీప్లెక్స్ ముందు అదుపుతప్పింది. బ్రేకులు పనిచేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెపుతున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: వేగంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు