ETV Bharat / state

Rice Millers Facing Troubles With New Rules : 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రెంటికి చెడిన రేవడిలా.. రైస్‌ మిల్లర్లు' - Grievance rice millers joint Karimnagar district

Rice Millers Facing Troubles With New Rules : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్‌ మిల్లర్ల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాము నలిగిపోతున్నామని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరాడించి ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సిన ధాన్యం మిల్లుల్లోనే గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. తడిసిన పంట ఓ వైపు మొలకెత్తుతున్న తరుణంలో మళ్లీ సీజన్‌ ధాన్యం వచ్చే అవకాశం ఉండటంతో మిల్లర్లు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.

Karimnagar district
rice millers
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 10:37 PM IST

Updated : Oct 7, 2023, 11:06 AM IST

Rice Millers Facing Troubles With New Rules కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రెంటికి చెడిన రేవడిలా రైస్‌ మిల్లర్లు

Rice Millers Facing Troubles With New Rules in Joint Karimnagar District : ఉమ్మడి కరీంనగర్ జిల్లా (Joint Karimnagar District) వ్యాప్తంగా గత యాసంగి, వానాకాలం సీజన్ల ధాన్యం బస్తాలు మిల్లుల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. సీఎంఆర్ కింద సేకరించిన ధాన్యాన్ని మరాడించాక ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖలకు అప్పగించాల్సి ఉండగా.. మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. తమకు సంబంధం లేకపోయినా కస్టం మిల్లింగ్‌లో విధిగా ఎఫ్ఆర్‌కే బియ్యం మాత్రమే ఇవ్వాలన్న నిబంధన పెట్టారు. ఈ క్రమంలో కొన్ని సార్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదంటూ ఎఫ్‌సీఐ అధికారులు తిరిగి పంపించడంతో తలనొప్పిగా మారింది.

'రికార్డు స్థాయిలో ధ్యానం కోనుగోలు కేంద్రాలు.. కోటి మెట్రిక్​ టన్నుల సేకరణనే లక్ష్యం'

Problems of Millers Due to Storage for Paddy : అసలే తమకు మిల్లింగ్ ఛార్జీలు దశాబ్ద కాలంగా పెంచకపోగా.. కొత్త కొత్త నిబంధనలతో ఇబ్బంది పెడుతున్నారని మిల్లర్లు (Millers ) వాపోతున్నారు. నిల్వ చేసేందుకు గోదాములు లేక చాలా వరకు ధాన్యం ఆరుబయట టార్పాలిన్లు కప్పి పెట్టారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచడంతో పసుపు రంగులోకి మారిన బియ్యాన్నిఎఫ్‌సీఐ నిరాకరిస్తోందని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ఇప్పుడైతే అసలు బియ్యాన్ని తీసుకోవటం లేదని.. ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

"నేను గత 33 సంవత్సరాల నుంచి రైస్ మిల్ ఇండస్ట్రీలో ఉన్నా. ఈ సంవత్సరం బాగా గడ్డుకాలం. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం అమ్ముతామని టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ఐఏఎస్ అధికారుల కమిటీ వేసింది. ఇప్పటి వరకూ ధాన్యం అమ్మడం కానీ కొనడం జరగడం లేదు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి రబీ ధాన్యాన్ని టెండర్ల ద్వారా అమ్మాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా ఖరీఫ్‌లో ధాన్యాన్ని సేకరించే వీలవుతోంది." - బోయినిపల్లి ప్రభాకర్‌రావు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతేడాది వానాకాలంలో మొత్తం 11.47 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని (Paddy) 350 మిల్లులకు పంపించారు. ఇందులో 67 శాతం అంటే 7.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 2.46 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇక, యాసంగిలో మొత్తం 12.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించగా.. 8.67 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది.

CM KCR Review : 'వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం'

ఇప్పటివరకు కేవలం 1.99 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఎఫ్‌సీఐకి (FCI) అప్పగించారు. తాము బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కయ్యాల కారణంగా ముందుకు కదలడం లేదని రైస్‌ మిల్లర్లు వాపోతున్నారు. మార్చి, ఏప్రిల్‌లో వచ్చే ధాన్యం కేవలం ఉప్పుడు బియ్యానికి పనికి వస్తాయని అంటున్నారు. అయితే కేంద్రం ఆ బియ్యం తీసుకోవడానికి అంగీకరిస్తే తప్ప తమ వ్యాపారం కొనసాగే పరిస్థితి లేదని మిల్లర్లు చెబుతున్నారు.

Rice Mills in Joint Karimnagar District : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బియ్యం తీసుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా తమిళనాడుకు పంపిస్తే తాము ఏదో తప్పు చేసినట్లు చిత్రీకరిస్తున్నారని రైస్‌ మిల్లర్లు వాపోతున్నారు. అధికారులు ఎంతసేపు సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై కేసులు పెడతామని బెదిరించడం కాకుండా నిల్వలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధాన్యం తరలించక పోతే యాసంగి ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని మిల్లర్లు హెచ్చరిస్తున్నారు.

Government Rice Mills in Telangana : ప్రభుత్వ ఆధ్వర్యంలో రైస్​ మిల్లులు.. ఇకనైనా రైతు లబ్దిపొందేనా..!

Government Rice Mills in Telangana : తెలంగాణలో ఇక ప్రభుత్వ రైస్‌ మిల్లులు.. త్వరలోనే సీఎం శ్రీకారం

Last Updated : Oct 7, 2023, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.