ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలోని జాతీయ పతాకం ముందు జనగణమన గీత ఆలాపన చేశారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన యువత... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆందోళన చేశారు. నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో టాయిలెట్లు, ప్రభుత్వ పాఠశాల్లో కనీస వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఇదీ చూడండి: ట్రాఫిక్ నియంత్రణకు నూతన సిగ్నలింగ్ వ్యవస్థ