కరీంనగర్ రూరల్ మండల కార్యాలయాల్లో ధరణి సేవలను జిల్లా కలెక్టర్ కె.శశాంక ప్రారంభించారు. అనంతరం కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకున్న ప్రజలకు అదే రోజున రిజిస్ట్రేషన్, మోటేషన్, ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ద్వారా మహమ్మద్ జహేద బేగం నుంచి తాడి ఎల్లయ్య కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆయన తెలిపారు.
కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో దయాల రవళి కొనుగోలు చేసిన భూమిని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని అన్నారు. అరగంటలో పని పూర్తి చేసి పంపించే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలకు చాలా సులభంగా అధికారులతో గానీ.. మధ్య దళారులతో గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకొనే సౌకర్యం కలిగిందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జిల్లాలో మొత్తం 49 ధరణి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజు 36 ధరణి కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు.
ఇవీ చూడండి... 'సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్'