ETV Bharat / state

భాజపా రాష్ట్ర సారథిగా సంజయ్​నే ఎందుకు నియమించారంటే? - తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడి పదవిపై ఉత్కంఠ వీడింది. భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్​ కుమార్​ను పార్టీ అధిష్ఠానం నియమించింది. అధ్యక్ష పదవి కోసం పది మంది పోటీ పడగా సంజయ్ ని వరించింది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు అంచలంచెలుగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ అండ కూడా సంజాయ్​కి కలిసొచ్చింది.

mp bandi sanjay kumar
mp bandi sanjay kumar
author img

By

Published : Mar 11, 2020, 8:27 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్​ను జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. అధ్యక్ష పదవి కోసం పది మంది పోటీ పడ్డారు. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్​తోపాటు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చింతా సాంబమూర్తి, సంకినేని వెంకటేశ్వర్లు, యెండల లక్ష్మీనారాయణ, చింతల రాంచంద్రారెడ్డి... అధ్యక్ష పదవి తమకు కట్టబెట్టాలని దరఖాస్తు చేసుకున్నారు.

ఆర్​ఎస్​ఎస్​ మద్దతు

జాతీయ స్థాయిలో డీకే.అరుణ, జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయతించారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి అవకాశం లేదని జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీ సీనియర్ నేతలతోపాటు కిషన్ రెడ్డి, మురళీధర్ రావు... లక్ష్మణ్ వైపే మొగ్గు చూపారు. ఆర్ఎస్ఎస్ మాత్రం సంజయ్​కి ఇవ్వాలని కోరింది.

పనితీరు మెప్పించింది

లక్ష్మణ్ తర్వాత పార్టీలో సంజయ్​కి మంచి గుర్తింపు ఉండటం.. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్​​లో చేరి ఏబీవీపీ, యువ మోర్చా, భాజపాలో వివిధ హోదాల్లో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన తీరును జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంది.

యూత్​ ఫాలోయింగ్​

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్, పోటీ చేసి ఓడిపోయిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. 2019 లోక్​సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సన్నిహితుడైన వినోద్ కుమార్​పై గెలుపొందడం, యూత్ ఫాలోయింగ్, ఆర్ఎస్ఎస్ అండదండలు సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అనుకూలించాయి.

ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్​కు జాతీయస్థాయిలో పదవి కట్టబెట్టడంతోపాటు రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.