ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టు తిరిగినా... తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కరీంనగర్ ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
భూ సమస్యల కోసం వెళ్తే... వీఆర్వోలు, ఎమ్మార్వోలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. తన భూ సమస్య పరిష్కరించాలని వెళ్తే వీఆర్వో రవీందర్ బెదిరింపులకు గురి చేశారని రేకొండ రైతు మోర కనకయ్య ఆరోపించారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు.
- ఇదీ చూడండి : పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్ప్రెస్