కరీంనగర్లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగుకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు. ఎస్ఆర్ఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బందికి పోలింగ్ కేంద్రంలో అవసరమైన సామాగ్రిని అందజేశారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి 140 చోట్ల వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామని... 50 పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేస్తున్నట్లు కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. దొంగ ఓట్లు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ తనిఖీలు ఉంటాయని... 26 మంది మైక్రో అబ్జర్వర్లను పెట్టామని కమిషనర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మహబూబ్నగర్లో రీపోలింగ్... ఐదుగురి సస్పెన్షన్