ETV Bharat / state

కొవిడ్​తో మృతిచెందిన వ్యక్తికి పోలీసుల అంత్యక్రియలు

ప్రస్తుతం కరోనా సోకిందంటే చాలు సొంతవారే వదిలి వెళ్తున్న రోజులివి. కానీ కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో మాత్రం ఇద్దరు ఎస్సైలు కొవిడ్​తో మృతిచెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.

Police conducted funeral for man who died with corona
కొవిడ్​ మృతునికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
author img

By

Published : May 12, 2021, 8:04 AM IST

కరీంనగర్​ జిల్లా సిరిసేడు గ్రామానికి చెందిన యాంసాని సంపత్‌(38) వైరస్‌ బారిన పడ్డారు. అయితే వైద్యం కోసం డబ్బు లేకపోవడంతో ఇంట్లోనే ఉండటంతో అతని తల్లి, తమ్ముడు, సోదరి కూడా వైరస్ బారిన పడ్డారు. బహిర్భూమి కోసం చెరువు వద్దకు వెళ్లిన సంపత్‌ తిరిగి రాకపోవడంతో... అతని సోదరుడు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు.

ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసినప్పటికి అంతిమ సంస్కారాలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. సమాచారం తెలుసుకున్న ఇల్లందుకుంట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్సైలు ప్రవీణ్​కుమార్​, రజనీకాంత్ ట్రాక్టర్​లో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. మానవత్వంతో ముందుకొచ్చిన ఎస్సైలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

కొవిడ్​ మృతునికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు

ఇదీ చదవండి: ఉగ్ర అనుచరుడు అరెస్ట్​.. భారీగా నగదు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.