తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థలో గణనీయమైన మార్పు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్‌లో జరిగిన పోలీస్ సంస్మరణ దినోత్సవానికి మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్ సునీల్‌రావు పాల్గొన్నారు.
పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించాక అమరవీరులకు మంత్రి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వక పోలీస్ విధానానికే ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. రేయింబవళ్లు పోలీసులు విధులు నిర్వర్తించినందువల్లే శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలను కోల్పోయిన వారికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను మరింత పెంచేందుకు కృషి చేస్తానని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః రాష్ట్రానికి కేంద్రం నుంచి బృందాలు పంపిస్తున్నాం: కిషన్ రెడ్డి