పట్టణ ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని పలు డివిజన్లలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. పారిశుద్ధ్యం, చెత్తసేకరణ ఎలా జరుగుతుందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో అటవీ ప్రాంతం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. అందుకోసం విధిగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాల్సిన అవసరం ఉందని మంత్రి గంగుల కోరారు. మంత్రితోపాటు మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తనయుడి ఏకగ్రీవం..తండ్రికి ఆనందదాయకం..