ETV Bharat / state

Vinodkumar: లాక్‌డౌన్‌ వల్ల కొన్ని నష్టాలు.. మరికొన్ని లాభాలు

కరీంనగర్​లోని మల్టీపర్పస్‌ పార్క్‌ను పనులను మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతితో కలిసి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పరిశీలించారు. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Planning Commission Vice President Vinod Kumar
Vinodkumar: కరీంనగర్​లో రూ.300కోట్లతో నిర్మాణపు పనులు
author img

By

Published : Jun 7, 2021, 2:13 PM IST

కరోనా లాక్‌డౌన్‌ వల్ల కొన్ని నష్టాలుంటే మరికొన్ని లాభాలున్నాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మిస్తున్న మల్టీపర్పస్‌ పార్క్‌ను మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతితో కలిసి పరిశీలించారు.

నగరంలో దాదాపు 300కోట్ల రూపాయలతో నిర్మాణపనులు జరుగుతున్నాయని వినోద్‌కుమార్‌ తెలిపారు. మరికొన్ని పనులకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. బోర్డు సమావేశం జరగనందు వల్ల తాత్సారం జరుగుతోందని అన్నారు. కరోనా దృష్ట్యా మరింత వేగంగా నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సర్కస్‌ గ్రౌండ్‌లో నిర్మాణపు పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు మల్టీపర్పస్‌ పార్క్‌ నిర్మాణం పూర్తి అయితే ఆహ్లాదకరమైన పార్కులు అందుబాటులోకి వస్తాయని వినోద్‌కుమార్‌ చెప్పారు. జిల్లా వాసి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కాంస్య విగ్రహాన్నికూడా ఏర్పాటు చేస్తామని వినోద్‌కుమార్‌ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.