కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో లాక్‌డౌన్ విధించారు. గత వారం వేరే గ్రామానికి పండగకు వెళ్లిన వారంతా అస్వస్థతకు గురికావటంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల్లో 53మందికి వ్యాధి నిర్ధారణ కావటంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.
వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా పంచాయతీ పాలకవర్గం లాక్‌డౌన్ తీర్మానించింది. ప్రజలందరూ సహకరించాలని కోరారు. కేసులు పెరుగుతుండడంతో పలు గ్రామాలు ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకున్నాయి.
ఇదీ చూడండి: కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలేంటి?