హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డికి(PADI KAUSHIK REDDY) పీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన ఫిర్యాదులను పరిశీలించిన క్రమశిక్షణా కమిటీ(PCC DISCIPLINARY COMMITTE) ఈ మేరకు షోకాజు నోటీసులు(Showcause notice) ఇచ్చింది. గతంలో కూడా కౌశిక్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండ రెడ్డి(KODANDA REDDY) తెలిపారు.
ప్రత్యేకంగా హుజూరాబాద్ నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి... ఈ మధ్య ఈటల రాజేందర్‌ను తెరాస పార్టీ బహిష్కరించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి నష్టమొచ్చే విధంగా మాట్లాడిండు. ఈ సందర్భంగా కమిటీ పక్షాన నేను ఫోన్ చేసి గాందీభవన్‌కు రమ్మన్న. జూన్ 12వ తేదీ నాడు ఆయన అచ్చిండు. వారితో ఇవన్నీ విషయాలు చర్చించినం. మరీ ప్రత్యేకంగా కేటీఆర్ తో ఒక లంచ్‌లో కలుసుకున్న సందర్భాన్ని కూడా చర్చించుకున్నం. కేటీఆర్ తోపాటు డోర్ వరకు పోవడం చూస్తే వైరల్ అయింది. పార్టీ కార్యకర్తలకు చాలా సందేహాలు వచ్చినయ్. సరే ఇవన్నీ జరిగినయయ్యా... నువ్వు జాగ్రత్తగా ఉండాలే. క్రమశిక్షణ పాటించాలే. ఇట్లాంటి పనులు చేయొద్దని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. - కోదండ రెడ్డి, క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్
అప్పుడు పిలిచి మాట్లాడామని... ఇప్పుడు మరోసారి అధికార నాయకులతో సన్నిహితంగా ఉన్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు(CONGRESS LEADERS) ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ సభ్యుల సమక్షంలో ఈ ఫిర్యాదులను పరిశీలించామని... ఆ తర్వాతే షోకాజు నోటీసులు ఇచ్చామని కమిటీ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. 24 గంటల్లోపు పాడి కౌశిక్ రెడ్డి వివరణ ఇవ్వాలని... సంతృప్తికరమైన సమాధానం రాని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాని అన్నారు. కౌషిక్ రెడ్డి తీరు మార్చుకోకపోతే పార్టీలోంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: Kaushik Reddy Audio Viral: హుజూరాబాద్ తెరాస టికెట్ నాదే.. !