కరీంనగర్ జిల్లా రామడుగు మండలం అన్నారం గ్రామంలో రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో వరిని పండించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించారు. నెల రోజులుగా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని.. తమ పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయింది.
'తడిసిన ధాన్యాన్ని కొనాలి'
కొనుగోలు కేంద్రం పక్కనే మురుగు కాలువ ఉండటం వల్ల రాత్రి కురిసిన వర్షానికి కాల్వకు గండి పడి కొనుగోలు కేంద్రంలోకి నీళ్లు చొచ్చుకెళ్లాయి. ఫలితంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరారు.