కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ఆరుకుటి కొమురయ్య అనే వ్యక్తి సెల్ టవర్ పైకెక్కి నిరసన తెలిపాడు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే ముగ్గురు వ్యక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయాడు.
ఎస్సై వివేక్, సర్పంచ్ నవీన్ రావులు సెల్ టవర్ వద్దకు చేరుకుని ఫోన్లో సముదాయించారు. బెదిరిస్తున్న వారి నుంచి రక్షణ కల్పిస్తామని తెలపటంతో సెల్ టవర్ పైనుంచి సదరు వ్యక్తి సురక్షితంగా దిగాడు.
ఇవీ చూడండి: తాగిన మత్తులో విద్యుత్ నియంత్రికను పట్టుకుని ప్రాణం కోల్పోయాడు