మత్తు తలకెక్కి విద్యుత్ నియంత్రికను పట్టుకుని ప్రాణాలు కోల్పోయాడో వ్యక్తి. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ వ్యక్తి మద్యం మత్తులో నడి రోడ్డుపై వీరంగం సృష్టించి... మైకంలో తూళుతూ విద్యుత్ నియంత్రికను పట్టుకున్నాడు. అందరూ చూస్తుండగానే మృత్యువాతపడ్డాడు.
మృతుడు ఏపీలోని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం వెంగళాపూర్కు చెందిన సుబ్బారాయుడిగా గుర్తించారు. కొంత కాలంగా కోరుట్లలో తాపీపని చేస్తున్నాడు.
ఇవీ చూడండి: గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక