కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ధాన్యం ఆరబెట్టే క్రమంలో వర్షం పడినందున అన్నదాతలు పరుగులు తీశారు. కొనుగోలు కేంద్రాల్లోనూ పట్టాలు అందుబాలులో లేక కొన్ని ధాన్యం కుప్పలు నీట మునిగాయి. నీటిని బయటకు తోడేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చూడండి: సమాజ సేవకు మేము సైతం అంటోన్న పురోహితులు