సాధారణంగా పిల్లలకు 21 రోజు నామకరణం వేడుక చేసి పేరు పెట్టడం చూశాం. కానీ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో లేగదూడకు నామకరణం వేడుక నిర్వహించారు.
గోమాత సేవా సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో... శివరాత్రి రోజు లేగ దూడ జన్మించింది. 21 రోజును పురస్కరించుకుని... లేగదూడకు నామకరణం వేడుక నిర్వహించి భవాని అనే పేరు పెట్టారు.
- ఇదీ చదవండి : ఆశ్రమాలే అడ్డాలు.. ఆతిథ్యం, భక్తి అతని అస్త్రాలు