ETV Bharat / state

సిక్కు స్నేహితునికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు - కరోనా మృతులు

వారి స్నేహాన్ని కరోనా ఆపలేకపోయింది. కొవిడ్​తో చనిపోయిన వారికి.. సొంత వారే అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్న ఈ తరుణంలో మానవత్వాన్ని, స్నేహభావాన్ని చాటారు కొందరు యువకులు. మహమ్మారి కోరల్లో చిక్కుకొని మరణించిన మిత్రుడికి సంప్రదాయ పద్ధతిలో ఆఖరి వీడ్కోలు తెలిపారు.

Muslims conducting a funeral for a Sikh friend in Karimnagar district
సిక్కు స్నేహితునికి అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు
author img

By

Published : May 20, 2021, 9:35 AM IST

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని శాస్త్రీ రోడ్డులో మతీన్ స్నేహితుల బృందం నివాసముంటుంది. ఈ సభ్యుల్లోని అనూప్​సింగ్​ ఇటీవల కరోనా బారినపడ్డాడు. స్నేహితులందరూ అతనికి ధైర్యం నూరిపోశారు. ఏమి కాదు నీకు అంటూ భరోసానిచ్చారు. కానీ అనూప్​సింగ్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

స్నేహితడు మృతి చెందినా.. వారంతా అతనిని విడిచిపోలేదు. తమ మతం కాదని ఆలోచించలేదు. ఆస్పత్రి నుంచి మొదలుకుని.. సిక్కు పద్ధతి అనుసరించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్నేహానికి కులమతాలే కాదు.. ఏ వైరస్​ కూడా అడ్డురాదని నిరూపించి ఆదర్శంగా నిలిచారు ఈ బృందం.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ ఎఫెక్ట్​: తిండి కోసం తిప్పలు.. చెట్ల కిందే పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.