దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలంతా ప్రధాని మోదీ గురించి ఆలోచిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వానప్రస్తా వృద్ధుల అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. అనాథ వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. 100 రోజుల పాలనలో ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఎంపీ పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్‌ను మోదీ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో 37 బిల్లులను ప్రవేశపెట్టి 30 బిల్లులు ఆమోదం పొందేలా చేసి మోదీ రికార్డు సృష్టించారని సంజయ్ తెలిపారు.
ఇదీ చూడండి : 'మీరు చెప్పుడేంది... మేమే చెప్తున్నం'