వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో టవర్ సర్కిల్ వద్ద జరిగే వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షించారు. రహదారులను మరమ్మతులు చేయాలని ఆదేశించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
ఇవీ చూడండి: ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్