కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను ఎంపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. గంగాధర మండలంలోని పలు గ్రామాలను సందర్శించి.. అక్కడి రైతులను పరామర్శించారు. రెవెన్యూ అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.
గత సంవత్సరం యాసంగిలో ఇదే విధంగా పంట నష్టపోయిన రైతులకు ఇంత వరకూ పరిహారం అందలేదని ఎంపీ గుర్తు చేశారు. ఈసారి రైతులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్లు