ప్రజా విరాళాలతో సేకరించిన 15 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసరాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశ్రాజపల్లి గ్రామంలో 100 కుటుంబాలకు పంపిణీ చేశారు. లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు.
లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా- ఫ్రాన్స్‌లో మరో 833మంది