ETV Bharat / state

పెసర చేనులో ఎమ్మెల్యే.. బాల్యాన్ని గుర్తు చేసుకున్న సుంకె - కరీంనగర్​ జిల్లా వార్తలు

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్​ వెళ్లే దారిలో రోడ్డు పక్కన పెసర చేను చూసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ వాహనాన్ని ఆపి మరీ పెసరకాయలు రుచి చూశారు. రైతులతో ముచ్చటించి.. వారి సమస్యలు తెలుసుకున్నారు.

MLA Sunke Ravi Chit Chat With Formers In Karimnagar District
పెసర రుచి చూసి.. బాల్యాన్ని గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే!
author img

By

Published : Jul 3, 2020, 3:18 PM IST

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్​ వెళ్లే దారిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పెసర చేనును చూసి ఆగారు. రైతును అడిగి మరీ పెసరకాయలు తెంపి రుచి చూశారు. రైతులతో ముచ్చటిస్తూ.. బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు పెసర కాయలు బాగా తినేవారమని రైతులతో తన బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు.

వానాకాలం మొదట్లోనే పంట మొదలుపెట్టడం వల్ల రైతులకు పెసర మంచి దిగుబడినిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. పంట మార్పిడి విధానం వల్ల తరువాత పంటకు దిగుబడి పెరిగి, ధాన్యానికి మంచి ధర లభిస్తుందన్నారు. అనంతరం తిర్మలపూర్​ గ్రామంలో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలన్నారు.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.