కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో సీపీ కమలాసన్ రెడ్డితో కలిసి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు. కెమెరాలను అందించిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
"చిగురుమామిడి మండలంలోని ఓగులపూర్ గ్రామ పరిధిలో జనవరి 30 లోపు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తాం. నియోజకవర్గంలోని మిగిలిన గ్రామాల్లోనూ ఏర్పాటుకు మరి కొంత మంది దాతలు ముందుకు రావాలి. "
-సతీష్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
"వ్యక్తులతో పోల్చుకుంటే సీసీ కెమెరాలకు సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కేసుల దర్యాప్తు విషయంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉపయోగపడతాయి. నేరం ఎవరు చేశారో గుర్తుపట్టడం సులభం అవుతుంది. నేరాలను నియంత్రించడం మాత్రం మన అందరి చేతుల్లోనే ఉంది. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. గ్రామాల్లో వీటి ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలి"
-కమలాసన్ రెడ్డి, కరీంనగర్ సీపీ
ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ సారథి, తిమ్మాపూర్ సీఐ మహేష్, చిగురుమామిడి ఎస్సై మధుకర్, మండలంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎనిమిదో రోజు బలరామావతారంలో భద్రాద్రి రామయ్య