గోదావరి జలాలు తోటపల్లి రిజర్వాయర్ నుంచి చిగురుమామిడి మీదుగా సైదాపూర్ మండలంలోని అన్ని చెరువులకు చేరుకుంటాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ తెలిపారు. త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగని ఆడపడుచులు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు పైబడిన ఆడపడుచులందరికీ సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరలను సీఎం కేసీఆర్ ఉచితంగా ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం 60 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఇవీ చూడండి:నేడు మౌలాలిలో వేణుమాధవ్ అంత్యక్రియలు