కరీంనగర్ పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పౌరసరఫరాల శాఖ తనకు భారంగా మారిందని సీఎం కేసీఆర్‌కు చెప్పుకుందామనుకున్నానని.. తన మనసులో మాట విన్నారేమో కానీ ఆ శాఖను గంగుల కమలాకర్‌కు అప్పగించారన్నారు. ఒక శాఖ భారం తగ్గిందని చిరునవ్వు నవ్వారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంగులను అభినందించారు. రానున్న కాలంలో అమ్మకంలో రైతులు ఇబ్బంది పడకుండా కలిసి మెలిసి పని చేద్దామని మంత్రి నిరంజన్‌రెడ్డితో అన్నారు. రైతుల ముఖంలో చిరునవ్వే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: మున్సిపాల్టీల్లో తెరాస విజయం కోసం కేటీఆర్ కసరత్తు