రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
ఐటీ రంగంలో మంత్రి కేటీఆర్... రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను పెంచారని తెలిపారు. పరిపాలనలో పారదర్శకతను అమలు చేసేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. క్రియాశీల రాజకీయాల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్... కార్యకర్తల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.