తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత అండగా ఉన్నారని , అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంటలో శుక్రవారం రాత్రి తెరాస ముఖ్యకార్యకర్తలు మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. మాజీ మంత్రి రాజేందర్ తనకు కమ్యూనిస్టు సిద్ధాంతాలున్నా ఆత్మరక్షణ కోసం ఆత్మవంచనతో భాజపాలో చేరుతున్నారని దుయ్యబట్టారు.
భానిస భవన్ అని ఎవరు విమర్శించారో అందరికీ తెలుసని, ప్రగతి భవన్‌లోనే సంక్షేమ పథకాలు రూపకల్పన జరగలేదా అని ప్రశ్నించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, సూడ ఛైర్మన్ రామకృష్ణరావు, వకుళాభరణం కృష్ణామోహన్‌రావు, జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, అరుకాల వీరేశలింగం, పొనగంటి మల్లయ్య, పి.సంపత్, పాల్గొన్నారు.
ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి