ETV Bharat / state

'రాజకీయ ప్రమేయం లేకుండా భూ ఆక్రమణలపై విచారణ' - కరీంనగర్​లో భూ ఆక్రమణలపై మంత్రి గంగుల చర్యలు

బొమ్మకల్‌‌ భూ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్​లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. పలు అంశాలపై సమావేశం నిర్వహించారు.

minister gangula said Transparent inquiry to land grabs in the karimnagar district
'జిల్లాలో భూ ఆక్రమణలపై పారదర్శకంగా విచారణ'
author img

By

Published : Aug 15, 2020, 5:26 PM IST

'జిల్లాలో భూ ఆక్రమణలపై పారదర్శకంగా విచారణ'

కరీంనగర్​ జిల్లాలో భూ ఆక్రమణలకు సంబంధించిన విచారణ పారదర్శకంగా జరుగుతోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఎవరు అక్రమాలకు పాల్పడ్డా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. విచారణ చేపట్టిన అధికారులు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌లపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవన్నారు. రెండు బృందాలు విచారణ చేస్తున్నాయని.. నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ భూములతోపాటు ప్రైవేటు స్థలాల సొంతదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూరికార్డుల్లో టాంపరింగ్ జరిగిన దాఖలాలు లేవన్నారు. మిషన్ కాకతీయ పనులు జరిగిన సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించి హద్దులు ఏర్పాటు చేశామన్నారు. శిఖం భూములను కాపాడి ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తామని మంత్రి గంగుల స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : 'వచ్చే ఆగస్టు 15 నాటికి కరోనా మహమ్మారి అంతరించిపోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.