రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. గెలిచేది తెరాస అభ్యర్థులేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న కేడీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల క్రమంలో సింగిల్ విండో ఛైర్మన్లతో సమావేశమయ్యారు. జిల్లాలో అవసరమైన 18 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
డైరెక్టర్ల ఎన్నికలు దాదాపు ఏకగ్రీవం అవుతాయని.. కేడీసీసీబీ ఛైర్మన్‌గా కొండూరి రవిందర్‌రావు పేరు ఖరారు చేశామని మంత్రి ప్రకటించారు. అభ్యర్థులతో కలిసి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. గతంలో టెస్కాబ్ ఛైర్మన్‌గా పనిచేసిన కొండూరి రవిందర్‌రావునే మరోసారి టెస్కాబ్ ఛైర్మన్‌గా ఎన్నిక చేయడం ఖాయమని మంత్రి వివరించారు.