రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా కరీంనగర్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోందని బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రధానంగా వీధి వ్యాపారుల ద్వారా కరోనా మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం వ్యాక్సినేషన్ చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు.
నగరంలో సుమారు 15 వేల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు... వారి కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం 30 వేల వరకూ ఉంటారని వీరందరికీ టీకాలు వేయిస్తామని తెలిపారు. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా