కరీంనగర్ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్(minister gangula kamalakar) అన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్ను(diagnostic centre) కలెక్టర్ శశాంక, నగర మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ప్రజలకు రోగ నిర్ధరణ సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో… ఏక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లాలోని 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి శాంపిళ్లను సేకరించి… మూడు రూట్ల ద్వారా డయాగ్నోస్టిక్ కేంద్రానికి(diagnostic centre) పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ విజయ, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: kodandaram: 'జర్నలిస్టు రఘను వెంటనే విడుదల చేయాలి'