ETV Bharat / state

'మహిళల అవస్థ గుర్తించాం.. ఆగస్టు 14లోపు నిర్మాణాలు పూర్తిచేస్తాం'

author img

By

Published : Jul 9, 2020, 4:11 PM IST

హరితహారంలో భాగంగా మంత్రి గంగుల మొక్కలు నాటారు. సులభ్​ కాంప్లెక్స్​ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆగస్టు 14 లోపు నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

Minister gangula kamalakar participant in harithaharam at karimnagar
ఆగస్టు 14 లోపు నిర్మాణాలు పూర్తి చేస్తాం: మంత్రి గంగుల

హరితహారంలో భాగంగా కరీంనగర్​లో పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు సులభ్​ కాంప్లెక్స్​ నిర్మాణాలకు మంత్రి గంగుల కమలాకర్​ శంకుస్థాపన చేశారు. కలెక్టర్​ శశాంక, మేయర్​ సునీల్​రావు, కమిషనర్​ క్రాంతితో కలిసి అల్గునూరులో మొక్కలు నాటారు.

అనంతరం భగత్​నగర్​ కూడలిలో సులభ్​కాంప్లెక్స్​ నిర్మాణానికి భూమిపూజ చేశారు. వివిధ పనులపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సులభ్​ కాంప్లెక్స్​ల సదుపాయం లేకపోవడం వల్ల ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. అందుకే ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సులభ్​ కాంప్లెక్స్​లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఆగస్టు 14 లోపు నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అధునాతనంగా నిర్మించే ఈ సులభ్​ కాంప్లెక్సుల నిర్వహణ ప్రైవేటు వారికి అప్పగించనున్నట్లు మంత్రి గంగుల వివరించారు.

ఇదీ చూడండి: నిమ్స్​లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.