రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నిధుల కొరత లేకుండా ఉండేందుకు పట్టణ ప్రగతితో పాటు పలు పథకాల కింద నిధులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రూ. 3కోట్ల 60లక్షలతో నిర్మించబోయే 30 ఓపెన్ జిమ్‌లకు మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఓ వైపు పార్కుల ఆధునీకరణతో పాటు ప్రత్యేకంగా ఆధునిక టాయిలెట్ల నిర్మాణం కూడా చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత పట్టణాల రూపురేఖలు ఎలా మారిపోయాయో ప్రజలే ప్రత్యక్షంగా చూస్తున్నారని మంత్రి గంగుల పేర్కొన్నారు. ప్రజలు ఏ ఉద్దేశంతో తెరాసను ఎన్నుకున్నారో ఆ ఆశలను వమ్ము చేయబోమని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గిట్టుబాటు ధర లేక.. మేకలకు మేతగా సొరతోట