ETV Bharat / state

'షర్మిలను ఎదుర్కోవడానికి కోటి బాణాలు సిద్ధం' - Cm kcr birthday today

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను కరీంనగర్​లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్‌లో పలువురు యువకులకు నియామక పత్రాలను మంత్రి గంగుల కమలాకర్​ అందజేశారు.

'షర్మిల బాణాన్ని ఎదుర్కొవడానికి కోటి బాణాలు సిద్ధం'

author img

By

Published : Feb 17, 2021, 12:08 PM IST

వైఎస్ షర్మిల... భాజపా సంధించిన బాణంగా భావిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెరాసను ఒంటరిగా ఎదుర్కొలేక కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌లో పలువురు యువకులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు.

హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వేర్వేరు పండుగలు జరుపుకున్నా... కేసీఆర్ పుట్టినరోజు మాత్రం అన్ని మతాల వారికి పండగేనని మంత్రి పేర్కొన్నారు. అందుకే తాను ఇవాళ కొత్త బట్టలు ధరించినట్లు వివరించారు. షర్మిల అనే ఒక బాణాన్ని వదిలితే తెలంగాణాలో ఆ బాణాన్ని ఎదుర్కోవడానికి కోటి బాణాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. షర్మిల తెలంగాణా వచ్చే కంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం నడుస్తున్న దృష్ట్యా అక్కడికి వెళితే అక్కడి ప్రజలు సంతోషపడతారని మంత్రి గంగుల కమలాకర్‌ సలహా ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.